హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి వైసీపీలోకి 51 మంది చేరిక

సత్యసాయి: కొత్తచెరువు మండలం మైలసముద్రం పంచాయతీకి చెందిన 51 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం వైసీపీలో చేరారు. పుట్టపర్తి వైసీపీ ఇన్‌ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.