VZM: గుర్ల, గరివిడి ఎంపీపీ పీఠాలపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. గుర్లలోని 19 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ 9, టీడీపీ 8, స్వతంత్ర అభ్యర్థి 1 చోట గెలుపొందారు. గరివిడిలో 20 స్థానాలకు గానూ వైసీపీ 11, టీడీపీ 9 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. తమ ఎంపీటీసీలందరినీ అరకు తరలించినట్లు స్థానిక నాయకులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
గుర్ల, గరివిడి ఎంపీపీ స్థానాలపై సస్పెన్స్..!


