KDP: జమ్మలమడుగులోని కన్నెలూరు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ధరణి సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో 26 కిలోల సన్న బియ్యం బస్తాను కేవలం 1,300 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నారాయణరెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగులో ధరణి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం


