హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ నీటి సరఫరా పనులపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ఇంజనీరింగ్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల ప్రస్తుత స్థితి, అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ పనుల వివరాలను అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.