హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేపల మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలోని చేపల మార్కెట్‌ను బుధవారం తనిఖీ చేసి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. మార్కెట్‌ను సందర్శించే వినియోగదారులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ఫిష్ మార్కెట్ ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.