హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిడ్డను తీసుకెళ్లడంతో దంపతుల ఆవేదన!

BPT: మూడేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారిని అధికారులు శిశు సంక్షేమ కేంద్రానికి తరలించడంతో ఓ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఓ యువతి ప్రసవించిన అనంతరం బిడ్డను చీరాలకు చెందిన దంపతులకు అప్పగించింది. ఫిర్యాదు అందడంతో బాపట్ల అధికారులు చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో దంపతులకు బిడ్డను చూసుకునే అవకాశం కల్పించి, ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు.