హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్విజ్ విజేతలకు ప్రతిభా పత్రాల పంపిణీ

కర్నూలు కలెక్టరేట్‌లో పాణ్యం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఎన్నికల అవగాహన క్విజ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రతిభా పత్రాలు అందజేశారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ విజేతలకు సర్టిఫికెట్లు ఇవాళ పంపిణీ చేసి అభినందించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్యం, ఎన్నికలపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.