హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

VZM: కోట జంక్షన్ ఎదురుగా ఉన్న ఎస్‌వీఆర్ డిగ్రీ కళాశాలలో ఇవాళ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులకు వివరించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరమని సూచించారు.