హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24 ఏళ్లకే సర్పంచిగా రాజకీయ ప్రస్థానం

NTR: నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన వసంత నాగేశ్వరరావు 24 ఏళ్లకే సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1972లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 1983లో తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా సేవలందించారు. ఆప్కాబ్ చైర్మన్‌గానూ పనిచేశారు. 81 ఏళ్ల వయసులోనూ గ్రామ రాజకీయాల్లో చురుకుగా ఉంటూ, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు.