హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. సీసీ ఫుటేజ్

కోనసీమ: అమలాపురం పట్టణంలోని 7వ వార్డు బసవనాయుడు వీధిలో నివాసం లేని ఇంట్లో చోరీ జరిగింది. గత ఏడాదిన్నరగా నంద్యాల సుధీర్ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. దీనిని గమనించిన గుర్తుతెలియని వ్యక్తి గత రాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలోని వస్తువులు, బట్టలను చిందరవందర చేసి, బైక్ తాళం చెవిని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.