KDP: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నవంబరు 29న జరగాల్సిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) వాయిదా పడింది. ఈ పరీక్షను డిసెంబరు 13న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్. షంషుద్దీన్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్ఎంఎంఎస్ పరీక్ష తేదీ మార్పు


