ASR: కొయ్యూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో- ఆప్షన్ సభ్యుని ఎన్నికలు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహారావు తెలిపారు. ఉదయం 10గంటలకు కో-ఆప్షన్ సభ్యుని నామినేషన్లు స్వీకరించి, మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నిక, ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు


