హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీల ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు

కృష్ణా: మచిలీపట్నం నగరంలో డ్రైనేజీల ప్రక్షాళనకు చర్యలు చేపట్టామని కమిషనర్ బాపిరాజు తెలిపారు. రెండు సూపర్ సక్కర్ వాహనాలతో డ్రైనేజీల్లో పూడిక తొలగిస్తున్నామన్నారు. బుధవారం లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద పనులను పరిశీలించిన ఆయన.. డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు.పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.