అన్నమయ్య: ధరణి పేరుతో సన్నరకం బియాన్ని ప్రభుత్వం పేదలకు రాయితీపై పంపిణీ చేస్తోంది. ఆధార్ సంఖ్యను నమోదు చేసుకుని 26 కిలోల బస్తాను రూ.1,274కు అందించేందుకు ప్రధాన పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. అధికారులు ఇటీవల అట్టహాసంగా వీటిని ప్రారంభించగా జిల్లా కేంద్రం మినహా మిగతా చోట్ల అప్పుడే మూతపడ్డాయి. పీలేరు, పుంగనూరులో ధరణీ కేంద్రాలు ఇంకా తెరుచుకోనే లేదు.
ఆంధ్రప్రదేశ్
ధరణి పేరుతో సన్నరకం బియ్యం పంపిణీ


