హైదరాబాద్: 28°C
వార్తలు

క్వాడ్ వేదికపై మోదీ దేశభక్తికి నెటిజన్లు ఫిదా

జాతీయ జెండాకు ప్రధాని మోదీ ఇచ్చిన గౌరవం నెటిజన్లను ఫిదా చేస్తోంది. మనీలాలో జరిగిన క్వాడ్ మీట్ ఫొటో సెషన్‌లో నేతలు నిలబడే స్థానాలను సూచిస్తూ కింద ఆయా దేశాల జెండాలతో కూడిన కార్డులు ఉంచారు. నేలపై ఉన్న భారత జెండాను గమనించిన మోదీ వెంటనే వంగి దాన్ని తీసుకుని జేబులో భద్రపరుచుకున్నారు. జాతీయ పతాకానికి ఆయన ఇచ్చిన ఈ అరుదైన గౌరవం అందరి మనసులు గెలుచుకుంటోంది.