KRNL: కర్నూలు జిల్లాలో సర్పంచ్ పదవి దక్కించుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ వ్యక్తి సంచలన ప్రకటన చేశారు. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే మూడు ఎకరాల పొలం రాసిస్తానని దండోరా వేయించారు. రూ.60 లక్షల విలువైన ఆస్తి గ్రామానికి ఇస్తానన్నారు. ఏకగ్రీవమైతే గొడవలు లేకుండా అభివృద్ధి వేగంగా జరుగుతుందని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే.. 3 ఎకరాల పొలం రాసిస్తా!


