హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క ఫోన్ కాల్‌తో తల్లీబిడ్డకు పునర్జన్మ!

గుంటూరుకు చెందిన ఓ మహిళ కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై, తన చిన్నారితో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. స్థానికులు 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమై తల్లీబిడ్డను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. సకాలంలో అందిన సమాచారం వారి ప్రాణాలను కాపాడింది. ఒక్క ఫోన్ కాల్‌తో తల్లీబిడ్డకు పునర్జన్మ లభించింది.