హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యలంక బీచ్‌లో గుంటూరు వాసి మృతి

GNTR: బాపట్ల సూర్యలంక బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన 15 మంది బృందం బుధవారం విహారయాత్ర కోసం సూర్యలంకకు వచ్చింది. సముద్ర స్నానానికి దిగిన పెదకాకాని వాసి షేక్ వలీ (40) లోతైన ప్రాంతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఘటనపై బాపట్ల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.