VZM: అక్వాన్ తుఫాను నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు మంగళవారం సూచించారు.ఆయన మాట్లాడుతూ కోతకు సిద్ధంగా ఉన్న వరి,మొక్కజొన్న పంటలను వెంటనే కోసి సురక్షితంగా నిల్వ చేయాలని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పాలన్నారు. ఆక్వా చెరువుల గట్లను పటిష్టం చేసుకోవాలని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాను నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలి'


