ప్రకాశం: మార్కాపురం మార్కెట్ యార్డ్ సమీపంలోని పోలీస్ చెకోపోస్టును ఎస్పీ పంకజ్ కుమార్ మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును సమీక్షించారు. నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాను అరికట్టేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు


