హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో బరిలో 879 మంది

WG: నరసాపురంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 153 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 726 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో ఎం. నాసరు రెడ్డి తెలిపారు. మొత్తం 879 మంది పోటీలో నిలిచారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.