ASR: జిల్లాలో అక్వాన్ తుఫాను ప్రభావంతో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ నోడల్ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మి బుధవారం తెలిపారు. ఇవాళ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, గురువారం భారీ వర్షాలు, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరి జిల్లాకు భారీ వర్ష సూచన


