హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్‌కౌంటర్.. హోరాహోరీ కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా దేవసర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరుగుతున్నాయని, కుల్గాంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు.