GNTR: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. కొల్లిపర(M) చక్రాయపాలెం గ్రామంలో సర్పంచ్ పదవికి భారీ వేలం జరిగింది. నిర్వహించిన వేలంపాటలో అడపాల నాగేశ్వరరావు రూ.51 లక్షలకు పదవిని దక్కించుకున్నారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు సమాచారం. ఈ నగదును గ్రామంలోని ఆలయ నిర్మాణానికి వినియోగించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సర్పంచ్ పీఠం కోసం భారీ మొత్తం పలకడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పీఠానికి భారీ వేలం.. రూ.51 లక్షలు!


