హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: 15 వేల మందితో 'కర్బీ' జానపద నృత్యం

అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లా డిఫూలో 15,000 మందికి పైగా కళాకారులు 'కర్బీ' జానపద నృత్యం (నిమ్సో కెరుంగ్) ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. నవంబర్ 16న 75వ కార్బి ఆంగ్లాంగ్ దినోత్సవ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ చారిత్రాత్మక ప్రదర్శన జరిగింది. 17 విభిన్న గిరిజన తెగలు, కమ్యూనిటీలకు చెందిన 15 వేల మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఇందులో పాల్గొన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.