SRD: జిల్లాలో ఐదు కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జహీరాబాద్, మునిపల్లి, నిజాంపేట్, నాగల్‌గిద్ద, వాట్పల్లి ప్రాంతాల్లో కొత్త సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుతో పాటు పాత సంఘాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం అనుమతించింది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాక తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి.
తెలంగాణ
జిల్లాకు ఐదు కొత్త పీఏసీఎస్‌లు మంజూరు


