VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న లారీ ఓ కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. డ్రైవర్ సత్యంతో పాటు వెంకటరమణ, ధనుంజయ్, శ్రీదేవి తదితరులు గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆటో లారీ ఢీకొని ఏడుగురికి గాయాలు..!


