హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DSC-2003 టీచర్లకు అలర్ట్

KDP: సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానానికి మారాలనుకునే అర్హులైన ఉపాధ్యాయులకు కడప జిల్లా విద్యాశాఖాధికారి కీలక సూచన చేశారు. ఈ ప్రక్రియ కోసం డీఎస్సీ-2003 నోటిఫికేషన్ కాపీతో పాటు ఎంపిక జాబితా, నియామక ఉత్తర్వులు, ధృవీకృత ప్రతులను సిద్ధం చేసుకోవాలని డీఈవో స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.