SKLM: ఇచ్ఛాపురం పట్టణంతోపాటు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం విద్యుత్తు సరఫరా ఉండదని ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు గొల్లవీధి, వీకే పేట, ఫకీరుపేట, సంతపేట, ఆసుపత్రి రోడ్, రథంవీధి, మండపల్లి, రత్తకన్న, తోటూరు, బాలకృష్ణపురం, మశాకపురం, జగన్నాథపురం, పురుషోత్తపురం, కేదారిపురం, ముచ్చింద్ర గ్రామాలకు సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


