హైదరాబాద్: 28°C
క్రీడలు

బ్యాటర్లు ఓపికగా ఆడాలి: రవిశాస్త్రి

భారత బ్యాటింగ్ తీరుపై మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ప్రతి మ్యాచ్‌లో 300 నుంచి 320 పరుగులు చేయాలనే ఆలోచనను పక్కన పెట్టాలని హితవు పలికాడు. బౌలర్లకు సహకరించే పిచ్‌లపై 260 పరుగులు చేసినా గెలవవచ్చని తెలిపాడు. ప్రపంచకప్‌లో సవాల్ విసిరే పిచ్‌లపై బ్యాటర్లు ఓపికగా ఆడాలని సూచించాడు. కివీస్ సిరీస్‌లో బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.