BHNG: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, కార్యదర్శి వి. మాధవిలత తెలిపారు. జిల్లాలో 988 కేసులు పెండింగ్లో ఉండగా, 157 కేసులను పరిష్కారానికి గుర్తించారు. భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట కోర్టుల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్


