హైదరాబాద్: 28°C
తెలంగాణ

రౌడీషీటర్‌పై నగర బహిష్కరణ వేట

MNCL: వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజాశాంతి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్ బొల్లం అంజనేయులు అలియాస్ అంజిపై పోలీసులు నగర బహిష్కరణ చర్యలు చేపట్టారు. హత్య, హత్యాయత్నం వంటి తీవ్ర కేసులు ఉన్నప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆరు నెలల పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరించేందుకు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నోటీసులు జారీ చేశారు.