హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్పత్తిదారులకు ఉపాధి అవకాశాలు

ASF: ఉత్పత్తిదారులకు ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలు పెంపొందించాలని ఐటీడీఏ పీఓ మంద మకరందు అధికారులను ఆదేశించారు. మంగళవారం వాంకిడి కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను సందర్శించి యంత్రాలు, మౌలిక సదుపాయాలు, సేవలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.