హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మల్లేష్ గౌడ్

BHNG: ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా సూదగాని మల్లేష్ గౌడ్, వైస్ ఛైర్మన్‌గా ఎంఏ ఎజాస్‌తో పాటు మరో పన్నెండు మందిని డైరెక్టర్లుగా నియమించారు. ఈ నియామకాలతో మార్కెట్ కమిటీ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.