SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి పీహెచ్సీలో మంగళవారం గర్భిణీలకు సహజ కాన్పులపై అవగాహన కల్పించారు. డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ.. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ
గర్భిణీలకు సహజ కాన్పులపై అవగాహన


