హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ బరిలో మాడుగుల ఎమ్మెల్యే సతీమణి

AKP: పరవాడ మండలం వెన్నెలపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్య నారాయణమూర్తి సతీమణి మాధవిలత మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని తన నివాసం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ర్యాలీగా బయలుదేరి పరవాడ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.