హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

KRNL: నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్‌లో కోసిగి ఎక్సైజ్ సీఐ భార్గవరెడ్డి, ఎస్సైలు విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.