ప్రకాశం: అర్ధవీడు మండలం మాగుటూరులో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మనోహర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రైతులు బోర్ల కింద ఎక్కువగా మిర్చి సాగు చేశారని, ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను వినియోగించి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్ధవీడులో 'పొలం పిలుస్తోంది'


