హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోక్ అదాలత్‌లపై విస్తృత అవగాహన కల్పించాలి'

కడపలో నవంబర్ 21న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్, డిసెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ గోపాల్ న్యాయవాదులకు సూచించారు. రాజీ మార్గం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.