ASR: గ్రామాల్లో ఎవరైనా నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు పాల్పడినా, అక్రమంగా మద్యం అమ్మకాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని చింతపల్లి ఎక్సైజ్ సీఐ బీ.శ్రీనివాస్, ఎస్సై చైతన్య హెచ్చరించారు. మంగళవారం కొయ్యూరులో మద్యం దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నాటుసారా, అక్రమ మద్యం విక్రయాలపై నిఘా


