హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు సంజామల ఏవో కీలక పిలుపు

NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడు రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారిణి భూమా జ్యోతి ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ-క్రాప్, ఇన్సూరెన్స్, పథకాలను రైతులకు వివరించారు. అనంతరం గ్రామంలో రైతులు సాగుచేసిన శనగ, జొన్న పంటలను ఆమె పరిశీలించారు. అటు, డిసెంబర్ 15లోగా రైతులు ఫసల్ భీమా నమోదు చేసుకోవాలని భూమా జ్యోతి పిలుపునిచ్చారు.