హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజుల్లో 480 నామినేషన్ల దాఖలు

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలో పంచాయతీలకు సంబంధించి నాలుగు నామినేషన్ కేంద్రాల్లో మంగళవారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. మూడవ రోజు సర్పంచ్ పదవులకు 26, వార్డు సభ్యుల స్థానాలకు 176 చొప్పున మొత్తం 202 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 480 నామినేషన్ల దాఖలు అయ్యాయని తెలిపారు.