హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కరాల పార్కింగ్‌కు 60 ఎకరాల భూమి

JGL: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి శివారు గోదావరి నది వద్ద వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాలను అధికారులు పరిశీలించారు. భక్తులు, వీఐపీలకు వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి 60 ఎకరాల భూమిని లీజుకు తీసుకుంటామని తహశీల్దార్ వరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో గంగా మాత ఆలయ ఛైర్మన్ రాజ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.