హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!

SRD: కోహీర్ మండలం బడంపేట రాచన్న స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాస గోపాష్టమి పురస్కరించుకుని ఆలయంలో ప్రదోషకాల ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మహానంది విగ్రహం ఎదుట ముత్తైదువులు రంగవల్లికలు తీర్చిదిద్ది, వాటిలో దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు.