హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

నెల్లూరు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల సూచించారు. కలెక్టరేట్లో NCORD సమావేశం జరిగింది. పోర్టులు, రైల్వేలు, రహదారులపై తనిఖీలు పెంచాలని, డ్రగ్స్ సరఫరా మార్గాలను గుర్తించి అడ్డుకోవాలని నిర్ణయించారు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలని అధికారులుకు తెలిపారు.