హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే సినిమాలో యోగిబాబు 16 పాత్రలు!

ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూన్ వాక్’ సినిమాలో యోగిబాబు సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన ఏకంగా 16 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఒకే సినిమాలో ఇన్ని పాత్రలు పోషించడం ఆసక్తికరంగా మారింది. యోగిబాబు నటన, కామెడీ టైమింగ్ వెండితెరపై ఎలాంటి సందడి చేయనున్నాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.