KNR: చిగురుమామిడి మండలం ఓగులపూర్లో మంగళవారం ఎస్సై జగదీశ్వర్ గ్రామ ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
ఓగులపూర్లో నేరాలపై పోలీసుల అవగాహన


