హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు కొత్త పింఛన్ అందించిన ఎమ్మెల్యే

SRD: ​సిర్గాపూర్ మండల కేంద్రంలో మంగళవారం 389 మంది లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్లను ఎమ్మెల్యే సంజీవరెడ్డి అందజేశారు. 28 గ్రామ పంచాయతీల పరిధిలో పింఛన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ వినోద్ పాటిల్, డీఈవో రోహిణి, ఎంపీడీవో ఆండాలమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.