MHBD: కొత్తగూడ మండలం ఓటాయి రామాలయం పరిసరాల్లో మంగళవారం భారీ కొండచిలువ సంచారం కలకలం రేపింది. పది రోజులుగా కనిపిస్తున్న కొండచిలువతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బంది శివ, నితిన్, సురేష్, కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
కొండచిలువ కలకలం


