ADB: బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పశువుల దొంగతనం, జంతు వధ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు అబ్దుల్ సాజిద్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. గతంలో సాకేరా గ్రామంలో ఎడ్లను దొంగిలించి భైంసాకు తరలించి వధించిన కేసులో నిందితుడుగా ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు CI పేర్కొన్నారు.
తెలంగాణ
జంతు వధ కేసులో నిందితుడి అరెస్ట్: బోథ్ సీఐ


